ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్

Monday,June 22,2020 - 11:55 by Z_CLU

రాధాకృష్ణ డైరెక్షన్ లో తన 20వ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. యూరప్ లో కొంత షూట్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో భారీ సెట్ రెడీ అవుతుందట. దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ హాస్పిటల్ సెట్ నిర్మిస్తున్నారని సమాచారం.

ఈ భారీ సెట్ లో సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సెట్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుందట. ఆగస్టు నుండి ఈ భారీ సెట్ లో షూట్ మొదలవుతుందని అంటున్నారు.

గోపీకృష్ణా మూవీస్ పై కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ లవ్ స్టోరీ సినిమాకు ‘రాధే శ్యామ్’ టైటిల్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసారు. త్వరలోనే ఈ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.