ప్రభాస్ ఫిక్సయ్యాడు ప్లాన్ రెడీ !

Tuesday,December 15,2020 - 12:26 by Z_CLU

రెబల్ స్టార్ Prabhas నుండి సినిమా వచ్చి ఏడాదిన్నరవుతోంది. అవును ‘సాహో’ గతేడాది ఆగస్ట్ లో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కరోన ఎఫెక్ట్ లేకపోతే ఈపాటికి ‘Radheshyam‘ విడుదలయ్యేది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో సినిమా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రభాస్ సినిమా ఆడియన్స్ ముందుకొస్తుంది.

అయితే ఈ గ్యాప్ ఇకపై ఉండకూడని డిసైడ్ అయ్యాడు ప్రభాస్. అవును ఏడాదికో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ రెడీ చేసుకొని మూడు సినిమాలు లైన్లో పెట్టాడు రెబెల్ స్టార్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో ‘Adipurush‘ లతో పాటు ప్రశాంత్ నీల్ తో ‘SALAAR’ సినిమా చేయబోతున్నాడు.

వీటిలో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుందనేది పక్కన పెడితే ఏడాదికో సినిమా మాత్రం పక్కా అంటున్నాడు ప్రభాస్. అందుకే Prabhas21, Adipurush మధ్యలో సలార్ ను ఒప్పుకున్నాడు. మరి ఈ ప్లానింగ్ వర్కౌట్ అయితే ప్రభాస్ నుండి ఎలాంటి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవ్వడం ఖాయం.

Also Check ప్రభాస్ తో ఆ సినిమాను రీమేక్ చేస్తాడా ?