ప్రభాస్ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన ఫ్యాన్స్

Wednesday,June 17,2020 - 02:10 by Z_CLU

ప్రభాస్ సినిమా ఒకటి చాన్నాళ్లుగా సెట్స్ పై ఉంది. రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తోంది. అయితే ఈ సినిమాకు ఇన్నాళ్లైనా టైటిల్ పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులే ఈ సినిమాకు పేరు పెట్టేశారు.

ప్రభాస్ సినిమాకు రాథేశ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. వీటిలో రాథేశ్యామ్ టైటిల్ ను ప్రభాస్ ఫ్యాన్ గ్రూప్స్ ఓన్ చేసుకున్నాయి.

ప్రస్తుతం రాథేశ్వామ్ అనే టైటిల్ తోనే ప్రభాస్ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్ని వెబ్ సైట్స్ కూడా స్ట్రయిట్ గా ప్రభాస్ సినిమాకు ఇదే పేరు పెట్టి ఆర్టికల్స్ రాస్తున్నాయి.

దీంతో మొన్నటివరకు కొంతంమందికి మాత్రమే పరిమితమైన ఈ టైటిల్ ప్రస్తుతం అందరికీ చేరువైంది. బాగా వైరల్ అయింది. అటు మేకర్స్ కూడా ఈ టైటిల్ కే ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.