#Prabhas20.. మ్యూజిక్ డైరక్టర్ ఫిక్స్

Sunday,June 21,2020 - 10:55 by Z_CLU

ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న #Prabhas20 కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఫైనల్ చేశారనేది ఆ అప్డేట్. ఇంత వరకు ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్స్ అవ్వలేదు. తాజాగా జస్టిన్ ప్రభాకరన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారట.

జస్టిన్ ఇటివలే విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమా ఆల్బమ్ మంచి ఆదరణ అందుకుంది. అందుకే ఇప్పుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీకి కూడా అతన్నే ఎంచుకున్నారట.

త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గోపీకృష్ణా మూవీస్ పై కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే మూవీ టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు.