పాయల్ మనసులో ఉన్న డైరక్టర్ ఇతడే

Wednesday,July 08,2020 - 12:02 by Z_CLU

ప్రతి హీరోయిన్ కు కెరీర్ పరంగా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఫలానా దర్శకుడితో మూవీ చేయాలని అనుకుంటారు. పాయల్ కు కూడా అలాంటి కోరిక ఒకటి ఉంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేయాలనేది పాయల్ డ్రీమ్.

అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్.. అదే సినిమా రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇలాంటి దర్శకుడితో కలిసి వర్క్ చేయాలని ఉందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది పాయల్.

ఇంతకుముందు విజయ్ దేవరకొండతో కలిసి వర్క్ చేయాలని ఉందంటూ ప్రకటించింది పాయల్. ఇప్పుడు సందీప్ రెడ్డి పేరును బయటపెట్టింది. సో.. అర్జున్ రెడ్డి కాంబో మరోసారి రిపీట్ అయితే అందులో పాయల్ కు అవకాశం దొరుకుతుందేమో చూడాలి.