#Prabhas20 ఫస్ట్ లుక్ త్వరలోనే!

Sunday,April 05,2020 - 01:46 by Z_CLU

ప్రభాస్ అప్ కమింగ్ సినిమాకు సంబంధించి ఇంతవరకూ టైటిల్ అనౌన్స్ చేయలేదు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు టైటిల్ అనౌన్స్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. కరోనా రాకపోయింటే ప్రభాస్ ఈ పాటికి ఫస్ట్ లుక్ తో సందడి చేసేవాడు.

అవును… ఉగాదికి సినిమా టైటిల్ రివీల్ చేసి ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలనుకున్నారు మేకర్స్. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్ లుక్ రిలీజ్ ను వాయిదా వేసారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే రెడీ గా
ఉన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఇక సినిమా రిలీజ్ విషయానికొస్తే… ఇదే ఏడాది రిలీజ్ చేయాలనుకున్నారు కానీ యూరోప్ షెడ్యూల్ ఇంకా ఉంది. కరోనా ప్రభావంతో ఇతర దేశాలు షూటింగ్ కు అనుమతిచ్చేలా కనిపించడం లేదు. సో షూట్ మొదలయ్యాక గానీ రిలీజ్ పై క్లారిటీ రాదు.

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాకు ఓ డియర్ లేదా రాథేశ్యామ్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.