కార్తీకేయ 2 కోసం సిక్స్ ప్యాక్

Sunday,April 05,2020 - 02:11 by Z_CLU

హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు పై విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ కి సంబంధించిన టైటిల్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ కి ఇప్ప‌టికే అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

ఇటీవ‌లే శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంకటేశ్వ‌రుని స‌న్నిధిలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వల్ల కార్తీకేయ 2 బృందం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. హీరో నిఖిల్ త‌న కెరీర్ లో తొలిసారిగా కార్తీకేయ 2 లో సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించ‌బోతున్నాడు.

ఇప్ప‌టికే నిఖిల్ సిక్స్ ప్యాక్ షేప్ కోసం కావాల్సిన క‌స‌ర‌త్తులు ప్రారంభించాడు. దీనికి సంబంధించిన సెల్పీ ఫోటో త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. మ‌రో నాలుగు వారాల్లో ఫుల్ సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారబోతున్నట్టు ట్విట్ చేశాడు.