సంక్రాంతి మిస్.. దసరా ఫిక్స్

Sunday,April 05,2020 - 01:21 by Z_CLU

‘అల వైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటివలే అనౌన్స్ చేసిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ వేసవిలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ షూట్ ఇంకా పూర్తి కానందున ఈ సినిమా షూట్ ను వాయిదా వేసుకున్నారు.

నిజానికి ఈ ఏప్రిల్ లోనే షూట్ బిగిన్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది దసరాకి సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. త్రివిక్రమ్ ,తారక్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ రిలీజ్ అయిన అక్టోబర్ లోనే ఈ సినిమాను కూడా విడుదల చేయాలని చూస్తున్నారట.

సో… సంక్రాంతికి ఎలాగూ చాన్స్ లేదు కాబట్టి దసరా హాలిడేస్ పై కన్నేశారు మేకర్స్. సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినాకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తారు.