ఇంతకీ ప్రభాస్ ఏమనుకుంటున్నాడు..?

Monday,December 12,2016 - 02:30 by Z_CLU

దాదాపు నాలుగేళ్ళు బాహుబలికి డెడికేట్ అయిపోయిన ప్రభాస్ ఇంకో డైరెక్టర్ నోటి నుండి యాక్షన్ అన్న మాట వినలేదు. డిసెంబర్ కల్లా షూటింగ్ కి ప్యాకప్ చెప్పాలని ప్లాన్ చేస్తున్న బాహుబలి టీం, ఇప్పటి వరకైతే షెడ్యూల్ కి ఏ మాత్రం అటూ, ఇటూ కాకుండా వర్కవుట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్.

అందుకే బాహుబలి ప్యాకప్ దగ్గర పడుతుండేసరికి ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మెల్లిగా ప్రభాస్ వైపు మళ్ళుతుంది. బాహుబలి తరవాత ప్రభాస్ ఏం చేయబోతున్నాడు..? ఆ మధ్యెప్పుడో ప్రభాస్ నెక్స్ట్ మూవీ రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ తో ఆల్ మోస్ట్ కన్ఫం అయిందని వార్తలొచ్చాయి.

డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా బాహుబలి కంక్లూజన్ కి ప్యాకప్ చెప్పబోతున్న ప్రభాస్, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బిజీ అయిపోతాడా..? లేక బ్రేక్ తీసుకున్నాకే సెట్స్ పైకి వస్తాడా..? అనే క్వశ్చన్ ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.