బాహుబలి హంగామా రేపటి నుండి షురూ..

Thursday,April 06,2017 - 05:38 by Z_CLU

బాహుబలి హంగామా బిగిన్ అయింది. ఏప్రిల్ 7 నుండి థియేటర్స్ లో బాహుబలి సినిమాని రీ రిలీజ్ చేస్తున్న ధర్మ ప్రొడక్షన్స్, ప్రేక్షకుల కోసం ఓ బంపర్ ఆఫర్ ని ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమా టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకుడికి బాహుబలి 2 సినిమా వీకెండ్ టికెట్ గ్యారంటీ అని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కొన్ని స్టేట్స్ లో అప్లికేబుల్ కాదు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలో తప్ప దేశంలో బాహుబలి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నా లిస్టెడ్ థియేటర్స్ లో ఏప్రిల్ 7 నుండి 17 లోపు ఈ ఆఫర్ ని ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.