లాస్ ఏంజిల్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రభాస్

Saturday,December 30,2017 - 12:02 by Z_CLU

ప్రభాస్ ‘సాహో’ మూవీ టీమ్ ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 5 నుండి అబూదాబి లో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననుంది. అయితే ప్రభాస్ మాత్రం ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్న హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం లాస్ ఏంజిల్స్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

స్పెషల్ గా డిజైన్ చేసిన జాగింగ్, కార్డియో వాస్క్యులర్  తో  పాటు  వెయిట్ ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రభాస్, ఈ సినిమాలోని మ్యాగ్జిమం యాక్షన్ ఎపిసోడ్స్ ని నెల రోజుల పాటు జరిగే నెక్స్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్  నటిస్తుంది. శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా ని UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.