బాహుబలి 2 ట్రేలర్ లాంచ్ డేట్ ఫిక్సయింది

Monday,March 06,2017 - 11:17 by Z_CLU

బాహుబలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. ఏప్రియల్ 28… ఇప్పుడు దాదాపు అందరి దృష్టి ఈ డేట్ పైనే, ఈ లోపు అప్పుడప్పుడు పోస్టర్స్ అని, ఫస్ట్ లుక్స్ అని తన స్టైల్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న బాహుబలి సినిమా యూనిట్, బాహుబలి 2 ట్రేలర్ లాంచ్ డేట్ & ప్లేస్ అనౌన్స్ చేసేసింది.

మార్చి 15 న బాహుబలి 2 ట్రేలర్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి – the beginning ని ముంబై లో రిలీజ్ చేసిన సినిమా యూనిట్, బాహుబలి – Conclusion కి కూడా సేమ్ ఫార్మాట్ ని ఫాలో అవుతుంది. ఈ సినిమాని హిందీలో ప్రెజెంట్ చేస్తున్న కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేశాడు.

 

ఓ వైపు ప్రమోషన్స్, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ ని పకడ్బందీగా, ఏ మాత్రం డిస్టబెన్స్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్న రాజమౌళి & టీం, మ్యాగ్జిమం మార్చిలోనే ఆడియో ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.