Prabhas Project K - ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ లాంఛ్

Saturday,July 24,2021 - 03:53 by Z_CLU

మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈరోజే సెట్స్ పైకి వచ్చింది. అయితే మొదటి షెడ్యుల్ లో ప్రభాస్ లేకుండానే మిగతా కాస్టింగ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నాడు దర్శకుడు. ముఖ్యంగా అమితాబ్ పోర్షన్ సీన్స్ ని షూట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో అమితాబ్ మిగతా నటీ నటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

prabhas project K deepika padukone

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా మొదలైన ఈ సినిమాకి ప్రభాస్ క్లాప్ కొట్టాడు. ఉదయమే సెట్స్ కి వెళ్లి అమితాబ్ ను కలిసి టీంలో జోష్ తీసుకొచ్చాడు ప్రభాస్. అనంతరం అమితాబ్ పై తీసిన మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. వైజయంతి మూవీస్ బేనర్ పై అశ్వని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘Project K’ అనే టైటిల్ పెట్టారు. అయితే ఇది వర్కింగ్ టైటిలా? లేదా ఇదే పెర్మనెంట్ గా ఫిక్స్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.

prabhas zeecinemalu

ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులను కొన్నేళ్ళు వెనక్కి తీసుకెళ్తాడని , సినిమా టైం మిషన్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. వీటిపై మేకర్స్ నుండి క్లారిటీ రావలసి ఉంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ కి సూపర్వైజర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.

ఈ సినిమాతో ప్రభాస్ కు సంబంధించిన 4 సినిమాలు సెట్స్ పైకి వచ్చినట్టయింది. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. రాధేశ్యామ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలోనే ఉంది. ఇక సలార్ కు సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తికాగా, మరో షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ప్రాజెక్ట్-K కూడా మొదలైంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics