'శతమానం భవతి' ఆడియో రిలీజ్ డీటెయిల్స్

Monday,December 12,2016 - 04:37 by Z_CLU

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దిల్ రాజు నిర్మాతగా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “శతమానం భవతి”. తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపుతూ లవ్ & ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి లో రిలీజ్ కానుంది.

      మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 18 న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఆడియో కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తో మరి కొందరు యంగ్ హీరోలు కూడా ఎటెండ్ అవుతారని సమాచారం. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా తో మరో సారి సంక్రాంతి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు శర్వా.