కరీంనగర్ లో గౌతమీపుత్ర శాతకర్ణీ ట్రైలర్ లాంచ్

Monday,December 12,2016 - 01:27 by Z_CLU

బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణీ థియేట్రికల్ ట్రేలర్ కరీంనగర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సినిమా యూనిట్. డిసెంబర్ 16 న తిరుపతిలో ఆడియో రిలీజ్ జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించి ఆల్ రెడీ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి.

శాతవాహన కాలం నుండి అత్యంత ప్రాచుర్యం కలిగిన కోటిలింగాల గుడిలో స్పెషల్ పూజా కార్యక్రమాలు జరపనున్న బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ఈ పూజ తరవాత, కరీంనగర్ లోని శ్రీ తిరుమల థియేటర్ లో థియేట్రికల్ ట్రేలర్ ని లాంచ్ చేయనున్నారు.

శ్రీ తిరుమల థియేటర్ తో పాటు మొత్తం 100 థియేటర్స్ లో ఈ ట్రేలర్ ప్రదర్శించాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. రోజు రోజుకి హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని బ్యాగ్ లో వేసుకుంటున్న గౌతమీపుత్ర శాతకర్ణీ, ప్రమోషన్స్ విషయంలోనూ అంతే గ్రాండ్ గా అడుగులు వేస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లో రానుంది.