స్వీట్ మెమోరీస్ ని తలుచుకున్న పూజాహెగ్డే

Monday,January 21,2019 - 04:17 by Z_CLU

రీసెంట్ గా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది ‘సీటీమార్’ సాంగ్. ఈ సందర్భంగా ఈ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో క్యాప్చర్ చేసిన మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది పూజా హెగ్డే. అల్లు అర్జున్, పూజా హెగ్డే ఈ సాంగ్ లోని ఫాస్ట్ బీట్స్ ని మ్యాచ్ చేయడం కోసం పడ్డ కష్టాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది పూజా. ఆ కష్టం స్క్రీన్ పై ఎన్ని సార్లు చూసినా, ఫ్యాన్స్ కి మరింత ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంది.

https://twitter.com/hegdepooja/status/1087270146555572224

ఈ సాంగ్ ఆడియో రిలీజైనప్పుడు ఫ్యాన్స్ లో ఏ రేంజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో, విజువల్ గా కూడా అంతే ఆకట్టుకుంది. దానికి తోడు ఈ సాంగ్ లో బన్ని, పూజా హెగ్డేల మ్యాజికల్ కెమిస్ట్రీ, ఈ పాటకి మరింత గ్రేస్ ని ఆడ్ చేసింది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి స్టెప్స్ కంపోజ్ చేశాడు.

దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని ప్రతి సాంగ్ ప్రత్యేకమే. బన్ని ఎనర్జీ లెవెల్స్ కి పర్ఫెక్ట్  గా  మ్యాచ్ అయ్యే సాంగ్స్ ని కంపోజ్ చేశాడు DSP ఈ సినిమాలో. ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్.