కొరటాల డైరెక్షన్ లో మెగాస్టార్ సినిమా – కొత్త అప్డేట్

Monday,January 21,2019 - 05:10 by Z_CLU

కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కనున్న మెగాస్టార్ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా మరోసారి కన్ఫర్మేషన్ ఇచ్చారు మేకర్స్.  రీసెంట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా సినిమా ఉండబోతుందని అనౌన్స్ అవ్వడంతో ఫ్యాన్స్ లో చిన్న సైజు కన్ఫ్యూజన్ బిగిన్ అయింది. ఇంతకీ కొరటాల డైరెక్షన్ లో సినిమా సంగతేంటి..? అసలీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో ఉంటుందా..? లేదా..? అనే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని కూడా సక్సెస్ ఫుల్ గా లాక్ చేసుకున్న మేకర్స్, తక్కిన ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన పనులను మరింత వేగవంతం చేశారు. సినిమా సెట్స్ పైకి ఎప్పటి నుండి వస్తుందనేది ప్రస్తుతానికి ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయినా, చిరు ‘సైరా’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేలోపు రెడీ టు షూట్ మోడ్ లో ఉండాలనేది మేకర్స్ టార్గెట్. ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ లోనే ఉన్నామని క్లారిటీ ఇచ్చింది సినిమా టీమ్.

ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కనుంది. ఈ సినిమా  ఎగ్జాక్ట్ స్టోరీలైన్ గెస్ చేయడం కొంచెం కష్టమే కానీ, సినిమా మాత్రం కొరటాల స్టైల్ లో ఓ కాంటెంపరరీ మెసేజ్ తో పాటు, అల్టిమేట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండబోతుంది.