మరో బిగ్ స్టార్ సినిమాలో పూజాహెగ్డే

Saturday,January 18,2020 - 12:02 by Z_CLU

వరస స్టార్ హీరో సినిమాలు లక్కీ లేడీ అనిపించుకుంటుంది పూజా హెగ్డే. రీసెంట్ గా అల్లు అర్జున్ సరసన చేసిన ‘అల…’ గ్రాండ్ సక్సెస్ అయింది. మరోవైపు ప్రభాస్ ‘జాన్ సినిమాతో సెట్స్ పై ఉంది. ఈ లోపు మరో బిగ్ స్టార్ సినిమాకి చేసింది.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా మేనేజ్ చేస్తున్న పూజా హెగ్డే అక్షయ్ కుమార్ కొత్త సినిమాలో నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

ఫర్హాద్ సామ్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే కృతి సానన్ హీరోయిన్ గా ఫిక్సయింది. అయితే పూజా సెకండ్ ఫీమేల్ లీడ్ గా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది. ఇదంతా పూజా హెగ్డే ప్లానింగా… లేకపోతే అలా జరిగిపోతుందా అనేది చెప్పలేం కానీ… ఈ హ్యాప్పెనింగ్ బ్యూటీకి బడా స్టార్స్ సినిమాలు అలా కలిసొస్తున్నాయంతే.