పూజా హెగ్డే – జస్ట్ స్టార్ హీరోస్ కోసమే...

Saturday,March 09,2019 - 10:02 by Z_CLU

‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయింది పూజా హెగ్డే. అదృష్టం ఎంతలా కలిసొచ్చిందంటే జస్ట్ 2 నెలల గ్యాప్ లోనే ‘ముకుంద’ కూడా రిలీజయింది. అంటే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే సెకండ్ చాన్స్ కొట్టేసింది. అది కరియర్ బిగినింగ్ స్టోరీ… కానీ DJ తరవాత ఏం జరిగింది…?

అందరూ స్టోరీ సెలెక్షన్ చేస్తారు… కానీ పూజా మాత్రం గ్యారంటీగా స్టార్స్ సెలెక్షన్ చేస్తుందనిపిస్తుంది. స్ట్రేట్ గా స్టార్ హీరోస్ తప్ప మరే సినిమాను ప్రిఫర్ చేయట్లేదు. ‘ముకుంద’ తరవాత బన్ని ‘దువ్వాడ జగన్నాథం’ లో నటించిన పూజా హెగ్డే వరస సినిమాలు గమనిస్తే, బ్రాండెడ్ సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తుందనిపిస్తుంది.

రీసెంట్ గా ‘రంగస్థలం’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన పూజ హెగ్డే, బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ లో పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా NTR సరసన ‘అరవింద సమేత’ లో నటించింది.

స్టార్ హీరో సినిమాలో చాన్స్ దొరికితే ఎవరు వదులుకుంటారు…? ఇక్కడ పాయింట్ అది కాదు ఒక్క కమర్షియల్ హీరోయిన్ గా తప్ప పూజా హెగ్డే, మరో తరహా సినిమాలకు అసలు ప్రాధాన్యం ఇవ్వట్లేదనిపిస్తుంది. రీసెంట్ గా ఫామ్ లోకి వచ్చిన కీర్తి సురేష్ కూడా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ, పర్ఫామెన్స్ ఎలివేట్ అయ్యేలా ప్లానింగ్ చేసుకుంటుంది. ఈ వరసలో చెప్పుకుంటూ పోవాలి కానీ సమాంత, కాజల్, తమన్నా కూడా వచ్చేస్తారు.

కానీ పూజ హెగ్డే మాత్రం జస్ట్ బ్రాండ్ పై మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మహేష్ బాబుతో ‘మహర్షి’ లో నటిస్తుంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, మ్యాగ్జిమం బన్ని, త్రివిక్రమ్ సినిమాలో కూడా పూజా హెగ్డే నే ఫిక్సయ్యేలా ఉందనిపిస్తుంది.