పూజా హెగ్డేకి ఇది రెండోసారి

Thursday,May 23,2019 - 11:03 by Z_CLU

పూజా హెగ్డే హీరోల సర్కిల్ మళ్ళీ ఫస్ట్ నుండి బిగిన్ అయిందా..? అంటే నిజమేనేమో అనిపిస్తుంది. మొదటి సినిమా చేసిన నాగచైతన్యతో రిపీట్ అవ్వలేదు కానీ ఆ తరవాత రిలీజైన ‘ముకుంద’ హీరో వరుణ్ తేజ్, ఈ సినిమా తరవాత చేసిన ‘DJ’ సినిమా హీరో అల్లు అర్జున్ తో రెండోసారి సినిమాలు చేస్తుంది పూజా హెగ్డే.

‘వాల్మీకి’లో వరుణ్ తేజ్ సరసన కనిపించనుంది పూజా హెగ్డే. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న సినిమాలో కూాడా పూజా హెగ్డే ఉంది. ఇలా తన పాత హీరోలు ఇద్దర్ని రిపీట్ చేస్తోంది పూజ.

తెలుగు సినిమాకి పరిచయమైన కొన్ని రోజుల్లోనే మెగా హీరోలను ఇంప్రెస్ చేయడంలో సక్సెసైంది ఈ ముంబై భామ. అందుకే బ్యాక్ టు బ్యాక్ ఈ ఇద్దరు సరసన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. దానికి తోడు చెర్రీ సినిమా ‘రంగస్థలం’ లో జిగేల్ రాణి గా మెరిసింది.

ఏది ఏమైనా పూజా హెగ్డే చేస్తున్న సినిమాల వరస చూస్తుంటే ఈ భామతో పని చేసిన హీరోలంతా మరోసారి ఆమెను రిపీట్ చేసే మూడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. చూస్తుంటే.. రేపోమాపో మహేష్ కూడా మరో ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు.