వందరోజుల వేడుకకు రంగస్థలం రెడీ

Tuesday,July 03,2018 - 11:33 by Z_CLU

రంగస్థలం 100 రోజుల సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరగనున్నాయి. మార్చి 30 న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1980’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ నెల 7 న 100 రోజులు కంప్లీట్ చేసుకోనుంది. అయితే ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునున్నారు మెగా ఫ్యాన్స్.

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ లో ప్రతి ఎలిమెంట్ స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. 1980’s లో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనగానే క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్స్, సినిమా రిలీజయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టైటిల్ దగ్గరి నుండి బిగిన్ అయితే సినిమా రిలీజ్ కి ముందు రిలీజైన ఈ సినిమా పాటలు, రంగస్థలం సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడిలా నటించిన తీరు మెగా ఫ్యాన్స్ ని కంప్లీట్ గా మెస్మరైజ్ చేసింది. దానికి తోడు డీ గ్లామర్ లుక్స్ లోను అంతే ఈజీగా మెస్మరైజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది సమంతా. రెగ్యులర్ సినిమాల రూట్ లో కాకుండా డిఫెరెంట్ గా తెరకెక్కిన ‘రంగస్థలం’ 100 రోజులు కంప్లీట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది.

హైదరాబాద్ తో పాటు ఆంద్రా లోని కొన్ని ఏరియాల్లో ఈ సినిమా 100 డేస్ ఈవెంట్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఫ్యాన్స్, త్వరలో ఈ ఈవెంట్స్ డీటేల్స్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.