అసలు రంగస్థలం సినిమా ఎందుకు చూడాలి?

Wednesday,March 28,2018 - 05:51 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కింది రంగస్థలం సినిమా. మార్చి 30న గ్రాండ్ గా విడుదలకానున్న ఈ సినిమాను ఎందుకు చూడాలనే ప్రశ్నకు చరణ్ సరైన సమాధానమిచ్చాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమా చూడ్డానికి 5 మెయిన్ రీజన్స్ ఉన్నాయంటున్నాడు. కనీసం వాటికోసమైనా ఈ సినిమాను ఓసారి చూడాలంటున్నాడు చెర్రీ.

 

స్టోరీ, నేపథ్యం

‘రంగస్థలం’ సినిమా గురించి ప్రస్తావించాల్సి వస్తే మొట్టమొదటగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా కథ, దాని నేపథ్యం గురించే. 1980 లలోని పల్లె వాతావరణంతో పాటు, అప్పటి లైఫ్ స్టైల్స్ తో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని 1980 లోకి తీసుకు వెళ్ళడం గ్యారంటీ…

సెట్

‘రంగస్థలం’ సినిమాలో మోస్ట్ హైలెటెడ్ ఎలిమెంట్ ఈ సినిమా సెట్. 1980 లలో ఉన్న పల్లెటూళ్ళు,  అప్పటి  జనాల  లైఫ్ స్టైల్స్  పై    రీసర్చ్ చేసి మరీ ఈ సెట్ ని డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోత్రే సబ్బాని. ఇప్పటికే సాంగ్స్ ప్రోమోస్ లో, ట్రైలర్ లో రియల్ విలేజ్ ని గుర్తు చేస్తున్న ఈ సెట్ ని ఇమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో మిక్స్ చేసి చూడాల్సిందే.

 

చిట్టిబాబు క్యారెక్టర్

రిలీజ్ కి ముందే ఈ చిట్టిబాబు క్యారెక్టర్ కి అందరూ కనెక్ట్ అయిపోయారు. ఇప్పటికే ట్రైలర్స్ లో ఊరిస్తున్న ఈ క్యారెక్టర్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

 

సుకుమార్ టేకింగ్

సుకుమార్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెసే చాలా డిఫెరెంట్. ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే చూజ్ చేసుకున్నా, ‘రంగస్థలం’ లాంటి హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించినా తన మార్క్ ఎలివేట్ చేయడం గ్యారంటీ. ఈ  విషయంలో ఫ్యాన్స్ ని ఏ మాత్రం నిరుత్సాహపరచడు సుకుమార్.

 

 

మ్యూజిక్

DSP మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్. 1980 ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ చేయకుండా,  ట్రెండీ  గా కంపోజ్   అయిన సాంగ్స్, సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయి. ‘ఎంత సక్కగున్నావే’ సాంగ్ తో బిగిన్ అయితే, సినిమాలోని స్పెషల్ సాంగ్  ‘జిగేల్ రాణి’ వరకు ప్రతీది దేనికదే స్పెషల్ గా నిలిచాయి. ఈ సాంగ్స్ ఆడియో ఎంతలా  రీచ్ అయిందో,  రేపు సినిమా రిలీజ్ అయ్యాక  విజువల్స్ కూడా అదే రేంజ్ లో ఇంప్రెస్ చేయనున్నాయి.