శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్?

Tuesday,July 03,2018 - 11:45 by Z_CLU

నాగచైతన్య-మారుతి ఫ్రెష్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అన్-అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

ఆగస్ట్ 31న శైలజారెడ్డి అల్లుడు సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇదే డేట్ తో త్వరలోనే టీజర్ లేదా ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సినిమాలో నాగచైతన్య సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

నిజానికి మొన్నంతా శైలజారెడ్డి అల్లుడు సినిమాకు సంబంధించి ఓ స్టిల్ హల్ చల్ చేసింది. అదే ఫస్ట్ లుక్ అంటూ ప్రచారం కూడా సాగింది. అయితే అది ఫేక్ ఫస్ట్ లుక్ అని మేకర్స్ ప్రకటించారు. ఈ వారంలోనే శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది.