భారమంతా చిరంజీవిదే - సుకుమార్

Thursday,March 29,2018 - 05:23 by Z_CLU

రంగస్థలం సినిమా సెన్సార్ పూర్తవ్వగానే రన్ టైం ఎంతో తెలిసింది. సెన్సార్ సర్టిఫికేట్ ఫొటోలు కూడా బయటకొచ్చాయి. సర్టిఫికేట్ లో రన్ టైం చూసి చాలామంది అవాక్కయ్యారు. అవును.. సినిమా డ్యూరేషన్ 2 గంటల 50 నిమిషాలుంది. ఈ కాలం ఇంత లాంగ్ రన్ టైమ్ తో సినిమా అంటే కాస్త కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మేకర్స్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో చిరంజీవిదే ఫైనల్ డెసిషన్ అంటున్నాడు దర్శకుడు సుకుమార్.

‘చిరంజీవి గారు సినిమా చూశాక, ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయడానికి వీల్లేదన్నారు. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆయన ఆ మాటనేసరికి మేం కూడా కాన్ఫిడెంట్ గా  ఫిక్సయిపోయాం. ఈ లెంగ్త్ మాది కాదు చిరంజీవి గారిది..’ అన్నాడు సుకుమార్.

 

 

నిజానికి రన్ టైం తక్కువగా ఉందా, ఎక్కువుందా అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రేక్షకుడ్ని లీనం చేశామా లేదా అనేది ముఖ్యం. మొన్నటికిమొన్న అర్జున్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో చూశాం. సో.. రంగస్థలం కూడా రన్ టైమ్ తో  సంబంధం లేకుండా అందరికీ నచ్చుతుందంటున్నాడు సుకుమార్. ఒకసారి సినిమాలో లీనమైన తర్వాత ఇక రన్ టైం గురించి ఎవరూ పట్టించుకోరని చెబుతున్నాడు.