న్యూ లుక్ లోకి మారిన రామ్ చరణ్

Saturday,March 17,2018 - 11:31 by Z_CLU

దాదాపు ఏడాదిగా గుబురు గడ్డంతో కనిపించాడు రామ్ చరణ్. ఇప్పుడీ హీరో మళ్లీ తన పాత స్టయిల్ లోకి వచ్చేశాడు. గడ్డం తీసేశాడు. మీసాలు ట్రిమ్ చేశాడు. అవును.. ఏడాది తర్వాత రామ్ చరణ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఇలా తన న్యూ లుక్ తో ఎటెండ్ అయ్యాడు చెర్రీ.

రంగస్థలం సినిమా కోసం దాదాపు 10 నెలలు గడ్డం పెంచాడు రామ్ చరణ్. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు గడ్డం తీయలేదు. రీసెంట్ గా మాత్రం మళ్లీ తన పాత లుక్ లోకి వచ్చేశాడు. ధృవ సినిమాలో ఎలా కనిపించాడో మళ్లీ ఆ లుక్ కనిపించింది

రంగస్థలం సినిమాను తన కెరీర్ లో వెరీవెరీ స్పెషల్ మూవీగా చెప్పుకొచ్చాడు చరణ్. తన పదేళ్ల కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీ అంటున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి సినిమా చేయలేనేమో అనే డౌట్ కూడా వ్యక్తంచేశాడు. అంతలా రంగస్థలం తనకు నచ్చిందంటున్నాడు చరణ్.

ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రేపు విశాఖ సాగరతీరాన గ్రాండ్ గా జరగనుంది. మార్చి 30న సినిమాను విడుదల చేయబోతున్నారు.