ఐయామ్ 25.. స్టిల్ వర్జిన్ : విజయ్ దేవరకొండ

Tuesday,July 03,2018 - 11:31 by Z_CLU

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవ‌ర‌కొండ కెరీర్ స్టార్టింగ్ నుండి త‌న చిత్రాల్ని ప్ర‌మెట్ చేసుకునే విధానం కొత్త‌గా వుండ‌ట‌మే కాకుండా ఆడియ‌న్స్ కి స్ట్రయిట్ గా రీచ్ అయ్యేలా త‌న స్టేట్‌మెంట్ వుంటుంది. ఎక్క‌డా మిడిల్ డ్రాప్ లు వుండ‌వనేది అర్జున్ రెడ్డి ని ప్ర‌మెట్ చేసిన విధానంలోనే అంద‌రికి తెలిసింది. ఇప్ప‌డు త‌ను న‌టించిన “గీత గోవిందం” చిత్రం కూడా అదే త‌ర‌హ‌లో ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యేలా ఆయామ్ 25 స్టిల్ వ‌ర్జిన్ అనే క్యాప్ష‌న్ పోస్ట‌ర్ తో త‌న పాత్ర‌ తీరును తెలియ‌జేసేలా విడుద‌ల చేశారు.

ఈ చిత్రంలో చ‌లో హీరోయిన్ ర‌ష్మిక గీత పాత్ర‌లో కనిపించనుంది. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం” గీత గోవిందం”. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. “గీత గోవిందం” సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. అగ‌ష్టు 15న గీతగోవిందం సినిమా వరల్డ్ వైడ్ విడుదలకానుంది.

న‌టీన‌టులు..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు త‌దిత‌రులు…

సాంకేతిక నిపుణులు..
స‌మ‌ర్ప‌కులు.. అల్లు అర‌వింద్‌
నిర్మాత‌.. బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం… ప‌రుశురామ్‌
సంగీతం.. గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌.. మార్తాండ్‌.కె.వెంక‌టేష్