పాయల్ రాజ్ పుత్ కొత్త యాంగిల్ లో...

Thursday,May 30,2019 - 12:04 by Z_CLU

హాట్… అనిపించుకోవడానికి జస్ట్ ఒక్క సినిమా సరిపోయింది పాయల్ రాజ్ పుత్ కి. RX 100 క్రియేట్ చేసిన క్రేజ్ పాయల్ కి వరస సినిమాలను తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆ సినిమాల సెట్స్ పైనే బిజీ బిజీగా ఉంది పాయల్ రాజ్ పుత్. కానీ కొంచెం దగ్గరగా గమనిస్తే పాయల్ రాజ్ పుత్ జస్ట్ గ్లామరస్ రోల్స్ చేయడానికే ఇండస్ట్రీకి వచ్చినట్టు అనిపించట్లేదు…

ముందు RX 100, ఆ తరవాత ‘సీత’ లో ఐటమ్ సాంగ్, ఈ లెక్క ప్రకారం చూస్తే పాయల్ నెక్స్ట్ సినిమాల్లోనూ అదే తరహా క్యారెక్టర్స్ లో కనిపించాలి. కానీ పాయల్ ఇక్కడే సర్ ప్రైజింగ్ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు తన చేతిలో ఉన్న సినిమాల్లో పాయల్ రాజ్ పుత్ ప్లే చేస్తున్న రోల్స్, తన ఇమేజ్ కి కంప్లీట్ డిఫెరెంట్ గా ఉండబోతున్నాయి.

రవితేజ ‘డిస్కోరాజా’ లో కళ్ళు లేని అమ్మాయిలా కనిపించనుంది పాయల్ రాజ్ పుత్. అంటే గ్లామర్ కన్నా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న రోల్. అంతెందుకు జస్ట్ గ్లామర్ కోసమే అయితే ‘వెంకీమామ’ లో వెంకటేష్ సరసన పాయల్ ని ఎంచుకోవాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలోను కొద్దో గొప్పో సెంటిమెంట్ టచ్ ఉన్న సీక్వెన్సెస్ లో కనిపించబోతుంది పాయల్ రాజ్ పుత్.

ఈ లెక్కన చూస్తే ఇక నుండి సరికొత్త యాంగిల్ లో కనిపించనుంది పాయల్ రాజ్ పుత్. ఇకపై గ్లామరస్ రోల్స్ ని పక్క పెడుతుందని కాదు కానీ, అవకాశాలు రావాలి కానీ ఆల్ రౌండర్ అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది పాయల్ రాజ్ పుత్.