రకుల్ సాయిపల్లవికి మైనసా..? ప్లస్సా..?

Thursday,May 30,2019 - 01:03 by Z_CLU

NGK సినిమాలో సూర్య సరసన నటించింది సాయి పల్లవి. హోమ్లీ లుక్స్ లో సూర్యకి పర్ఫెక్ట్ జోడీ అనిపిస్తుంది. అయితే ఇక్కడే మరో గ్లామరస్ డీవియేషన్ ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో రకుల్ కూడా అంతే స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ లో సాయి పల్లవి ఫ్యూచర్ కరియర్ పై డిస్కర్షన్ బిగిన్ అయింది.

‘పడి పడి లేచే మనసు’ సక్సెస్ కాకపోయినా సాయిపల్లవి విషయంలో ఫ్యాన్స్ లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. స్ట్రయిట్ తెలుగు సినిమా కాకుండా డబ్బింగ్ సినిమా వచ్చినా అంతే క్రేజీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ రీసెంట్ గా రిలీజైన ‘మారి 2’  కనీసం ఫస్ట్ వీకెండ్ కూడా సరిగ్గా నిలబడలేకపోయింది. అక్కడే సాయి పల్లవి కరియర్ పై చిన్న క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది.

ఒక గట్టి సక్సెస్ పడితే సాయి పల్లవి కరియర్ ట్రాక్ లో పడటం ఖాయం. NGK సక్సెస్ అయితే  మళ్ళీ ఫోకస్ లోకి రావడం పక్కా. కాకపోతే ఇక్కడ  రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవికి  కొద్దో గొప్పో మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలోనూ ఇద్దరు హీరోయిన్స్  ఉన్న సినిమాలు రాలేదా..? ఇప్పుడు దీని గురించి పర్టికులర్ టాపిక్ అవసరమా అంటే…  సాయి పల్లవి విషయంలో అవసరమే. వరస ఫ్లాపుల మధ్య క్రేజ్ తగ్గిపోతున్న ఈ టైమ్ లో, తన ప్రెజెన్స్ ని రిజిస్టర్  చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది… సాయి పల్లవి  కూడా గట్టిగా  ప్రయత్నించిందనే అనిపిస్తుంది. కాకపోతే రకుల్ ప్రీత్ సింగ్… సాయిపల్లవి ప్రయత్నానికి ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..? చూడాలి