పాయల్ రాజ్ పుత్ కి అంత సీనుందా..?

Thursday,June 27,2019 - 12:02 by Z_CLU

‘అరుంధతి’ సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని సెట్ చేసింది. ఇక అనుష్క విషయానికి వస్తే తన కరియర్ లో అది 12 వ సినిమా. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అనిపించుకుంది ఈ సినిమాలో. కొందరైతే ఆ క్యారెక్టర్ లో అనుష్కను తప్ప ఇంకొకరిని ఇమాజిన్ కూడా చేసుకోలేం అన్నంతగా కనెక్ట్ అయ్యారు… ఇప్పుడు ‘అరుంధతి 2’ లో అంతే పవర్ ఫుల్ రోల్ పాయల్ రాజ్ పుత్ ప్లే చేయనుంది.

ఈ సినిమాకి సంబంధించి ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు ‘అరుంధతి’ గా పాయల్ రాజ్ పుత్ అనగానే సోషల్ మీడియాలో డిఫెరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. పాయల్ రాజ్ పుత్ కి ఉన్న అనుభవం జస్ట్ ఒకే ఒక్క సినిమా అదీ RX 100. ఇంకా 2 వ సినిమా కూడా రిలీజవ్వలేదు. అలాంటిది అప్పుడే ‘అరుంధతి’ లాంటి హెవీ క్యారెక్టర్ అంటే కొంచెం తొందరపడినట్టు లేదూ…?

గ్లామరస్ డాల్ గా యూత్ లో రిజిస్టర్ అయిన పాయల్ రాజ్ పుత్ సడెన్ గా ‘అరుంధతి’ గా కనిపిస్తే సింక్ అవుతుందా…? అంత హెవీ స్టాండర్డ్స్ ఉన్న సినిమాకి పాయల్ అనుభవం సరిపోతుందా…? ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ ఫ్యాన్స్ నే కాదు పాయల్ రాజ్ పుత్ ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

గతంలో వచ్చిన ‘అరుంధతి’ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కింది. మరి ఈ అరుంధతికి డైరెక్టర్ ఎవరు…? సడెన్ గా పాయల్ రాజ్ పుత్ ని మరోసారి లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చిన ఈ ‘అరుంధతి’ సీక్వెల్ కి సంబంధించి అసలు విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.