నాగశౌర్య కొంచెం వేరు

Thursday,May 30,2019 - 11:04 by Z_CLU

మాస్ హీరో అనిపించుకోగలిగే  క్వాలిటీస్ 100% ఉన్నాయి నాగశౌర్యలో… ఓ మంచి కమర్షియల్ కథ పడాలి కానీ బాక్సాఫీస్ రేస్ కి ఈజీగా క్వాలిఫై అవుతాడు… కానీ నాగశౌర్య ఈ యాంగిల్ లో ఎప్పుడూ ఆలోచించడు.

ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ‘ఓ బేబీ’ సినిమా 100% సమంతాదే… అనుమానం లేదు. అలాంటిది ఈ సినిమాలో హీరోగా అవకాశం అనేసరికి ఏమాత్రం ఆలోచించకుండా సంతకం చేసేశాడు. నిజానికి ఇందులో హీరోయిజం తక్కువ ఉంటుంది. కథ మొత్తం సమంత చుట్టూ తిరుగుతుంది. కానీ తన పాత్ర కూడా నచ్చడంతో ఓకే చెప్పేశాడు శౌర్య

 

 

గతంలోనూ సాయి పల్లవి ‘కణం’ సినిమాలో నటించాడు నాగశౌర్య. కథ పరంగా స్కోప్ ఉన్నది సాయి పల్లవికే. కానీ కథ గొప్పదన్న ఒక్క కారణంతో ఈ సినిమా చేశాడు నాగశౌర్య. 

ఇలా డిఫరెంట్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంటూ.. ‘నాగశౌర్య కొంచెం వేరు’ అనిపించుకుంటున్నారు