మరో సీనియర్ హీరో సరసన పాయల్ రాజ్ పుత్

Tuesday,May 14,2019 - 11:03 by Z_CLU

బాలయ్య కొత్త సినిమాలో పాయల్ రాజ్ పుత్ కి ఛాన్స్..? ఈ న్యూస్ ఇప్పటి వరకైతే ఎక్కడా అఫీషియల్ గా అయితే అనౌన్స్ కాలేదు కానీ RX 100 రిలీజ్ తరవాత పాయల్ కి కలిసొస్తున్న టైమ్ చూస్తుంటే, బాలయ్య సరసన కూడా కనిపించడం పెద్ద విషయమేం కాదనిపిస్తుంది.

జస్ట్ ఒక్క సినిమాతోనే సీనియర్ హీరోలను ఇంప్రెస్ చేసేసింది పాయల్ రాజ్ పుత్. ఇప్పటికే వెంకటేష్ సరసన ‘వెంకీమామ’లో నటిస్తుంది.  నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాలోను నాగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ RX100 బ్యూటీ కే ఇచ్చినట్టు తెలుస్తుంది.

2 సినిమాలతో పాటు ‘డిస్కోరాజా’ లో కూడా రవితేజ సరసన నటిస్తోంది పాయల్. ఈ వరసలో బాలయ్య సినిమాలో చాన్స్ కొట్టేసే అవకాశాలు కూడా బోలెడు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో ‘హరిప్రియ’ ని ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ వరసలో మరో హీరోయిన్ గా  పాయల్ ప్రొఫైల్ కూడా ఉన్నట్టు టాక్. వరసగా ఇప్పటికే సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తున్న పాయల్, అదృష్టం కలిసొస్తే బాలయ్య సరసన కనిపించే అవకాశాలు కూడా బోలెడు  కనిపిస్తున్నాయి.