చుల్ బుల్ పాండే మూడో అవతారం రెడీ

Tuesday,July 11,2017 - 05:06 by Z_CLU

 సల్మాన్ ఖాన్ హీరోగా అభినవ్ కశ్యప్ డైరెక్షన్ లో తెరకెక్కిన దబాంగ్ బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరవాత దబాంగ్ 2 ని అర్బాజ్ ఖాన్ డైరెక్ట్ చేశాడు.  గత కొద్ది కాలంగా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ లో బోలెడంత క్యూరాసిటీ రేజ్ చేస్తున్న దబాంగ్ 3 డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. గతంలో ‘వాంటెడ్’ సినిమాతో సూపర్ హిట్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రభుదేవాని ఈ సినిమాకి కూడా డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాడు.

ట్యూబ్ లైట్ సినిమా తరవాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని బిగినింగ్ నుండే ప్లాన్డ్ గా ఉన్న సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 కి కూడా తానే స్టోరీ లైన్ సజెస్ట్ చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దబాంగ్ 3 టీమ్, త్వరలో మిగతా డీటేల్స్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది.