ప్రీ-రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్న పవన్ కల్యాణ్

Thursday,September 14,2017 - 01:30 by Z_CLU

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. కానీ టైటిల్ తో సంబంధం లేకుండా సినిమా బిజినెస్ జరిగిపోతోంది. పవన్-త్రివిక్రమ్ ది క్రేజీ కాంబినేషన్ కావడమే దీనికి కారణం. ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.100 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేసింది.

ఈ మూవీ నైజాం హక్కుల్ని ప్రముఖ నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దక్కించుకున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. పవన్ సినిమా రైట్స్ కోసం దిల్ రాజు ఏకంగా 29 కోట్ల రూపాయలు పెట్టారని తెలుస్తోంది. ఇక సీడెడ్ లో ఈ సినిమా 16.65 కోట్ల రూపాయలకు, గుంటూరులో 9.50 కోట్లకు, వెస్ట్ లో 6.75 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది.

ఇలా విడుదలకు ముందే పవన్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బాహుబలి-2 తర్వాత భారీ స్థాయిలో బిజినెస్ చేసిన సినిమా పవన్ మూవీ రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.