ఇంకాస్త పెరగనున్న చిరంజీవి సినిమా బడ్జెట్

Thursday,September 14,2017 - 01:01 by Z_CLU

సైరా నరసింహారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు చిరంజీవి. ఈ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా కోసం 200 కోట్ల రూపాయల్ని కేటాయించగా.. తాజాగా ఈ లెక్క ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా రాబోతోంది సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ అవసరం. ఇప్పటికే కొన్ని సెట్స్ నిర్మాణాలు పూర్తయ్యాయి. జైపూర్ లాంటి ప్రాంతాల్లో మరికొన్ని సెట్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇంకొన్ని భారీ సెట్స్ కూడా నిర్మిస్తారట. వీటితో పాటు మరికొంతమంది స్టార్ నటీనటులు, టెక్నీషియన్లను తీసుకోవాలని అనుకుంటున్నారు. వీటితో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యారు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే సైరా ప్రాజెక్టు బడ్జెట్ మరో 50 కోట్లు పెరిగే సూచనలున్నాయని టాక్.

బడ్జెట్ కాస్త ఎక్కువైనా చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా సైరాను నిలిపేందుకు యూనిట్ కృషిచేస్తోంది. ఓవైపు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే, ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు రామ్ చరణ్. సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఇప్పటికే ఫిక్స్ చేశారు. సంగీత దర్శకుడు రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.