"బయటకొచ్చి చూస్తే" బ్లాక్ బస్టర్

Wednesday,November 08,2017 - 11:35 by Z_CLU

పవన్ 25వ సినిమా అజ్ఞాతవాసి సెన్సేషన్స్ షురూ అయ్యాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్ననే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అనిరుధ్ కంపోజిషన్ లో “బయటకొచ్చి చూస్తే” అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ఇనిస్టెంట్ గా హిట్ అయింది. గంటకు లక్ష వ్యూస్ చొప్పున కౌంట్ పెంచుకుంటూ సోషల్ మీడియాలో సునామీ రేపింది ఈ సాంగ్.

నిన్న ఉదయం సరిగ్గా 10 గంటలకు విడుదలైన ఈ సాంగ్.. విడుదలైన 8 గంటల్లోనే మిలియన్ (10 లక్షల) వ్యూస్ సంపాదించింది. ఈ సాంగ్ హవా ఇంకా తగ్గలేదు. రెండో రోజైన ఈ రోజు కూడా ఈ సింగిల్ కు లక్షల్లో వస్తున్నాయి. ప్రస్తుతానికి 15లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ పాట

పవన్ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది.