బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసిన పవన్

Monday,September 18,2017 - 01:21 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తాజాగా మరో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. నిన్నటితో ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ ముగిసింది. ఎల్లుండి (సెప్టెంబర్ 20) నుంచి హైదరాబాద్ లో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.

బ్యాంకాక్ లో పవన్ పై ఓ డిఫరెంట్ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. సినిమాలో మొత్తం 7 ఫైట్స్ ఉంటే.. అందులో ఇదొకటి. సంథింగ్ స్పెషల్ గా ఈ యాక్షన్ బ్లాక్ ఉంటుందని టాక్. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ చివరి నాటికి పవన్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.

అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మ్యూజికల్ సర్ ప్రైజ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తారు.