సినిమా మారింది .. రావడం మాత్రం పక్కా !

Friday,July 30,2021 - 08:26 by Z_CLU

కొన్ని సార్లు రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ పవన్ గోపాల గోపాల పవన్ ఓ డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు అదే పవన్ నెక్స్ట్ సినిమా విషయంలో పవన్ ఇదే ఫాలో అవుతున్నాడని చెప్పనక్కర్లేదు. సినిమా మారిందే కానీ రావాడం మాత్రం పక్కా అంటూ నెక్స్ట్ సినిమాతో చెప్పిన టైం కే రాబోతున్నాడు పవన్. వచ్చే సంక్రాంతి కి క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘హరి హర వీర మల్లు’ సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్.

pawan bheemla nayak sagar chandra movie

కానీ సెకండ్ వేవ్ ఎఫక్ట్ తో సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం, షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండటంతో వచ్చే సంక్రాంతి నుండి సినిమా తప్పుకుంది. సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. అయితే ఆ సినిమా కాకపోతేనేం మళ్ళీ తను నటిస్తున్న మరో సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు పవర్ స్టార్. రానా తో కలిసి పవన్ నటిస్తున్న సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఓ మేకింగ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు పవన్. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

pawan rana movie (1)

దీంతో సంక్రాంతి కి పవన్ సినిమా మిస్ అవుతున్నామనుకునే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందింది. ఇక సంక్రాంతి బరిలో ఆల్రెడీ మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ కూడా ఉంది. సో ఈసారి పవన్ , మహేష్ ల మధ్య బాక్సాఫీస్ ఫెస్టివల్ పోటీ జరగనుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics