సూపర్ హిట్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సునీల్

Thursday,September 14,2017 - 02:02 by Z_CLU

రీమేక్స్ చేయడం సునీల్ కు కొత్తకాదు. ఇప్పటికే పలు రీమేక్స్ చేశాడు. ప్రస్తుతం ఎన్.శంకర్ దర్శకత్వంలో సునీల్ చేస్తున్న సినిమా కూడీ రీమేక్ ప్రాజెక్టు. త్వరలోనే మరో రీమేక్ లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో. తమిళ్ లో సూపర్ హిట్ అయిన శతురంగ వెట్టై సినిమాను తెలుగులో చేయబోతున్నాడు సునీల్.

2014 లో వచ్చిన ‘శతురంగ వెట్టై’ సినిమాను క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో ఈ సినిమా ది బెస్ట్ గా నిలిచింది. వికటన్ అవార్డు తో పాటు చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా అవార్డు పొందింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. అరవింద్ స్వామి, త్రిష హీరోహీరోయిన్లుగా శతురంగ వెట్టై-2 రూపుదిద్దుకుంటోంది.

ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు రీమేక్ లో నటించడానికి ఓకే చెప్పాడు సునీల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాను ‘రోమియో’ ఫేమ్ గోపీ గణేశ్ డైరక్ట్ చేస్తాడు. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు.