మరికొన్ని గంటల్లో పవన్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్

Friday,September 01,2017 - 03:06 by Z_CLU

రేపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈరోజు పవన్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. పవన్ కు ఇది ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా రాబోతున్న మొట్టమొదటి ఎలిమెంట్ ఇదే.

కాన్సెప్ట్ పోస్టర్ అనేది టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త. సినిమా కాన్సెప్ట్ ను ఇందులో చెప్పబోతున్నారనే విషయం తెలుస్తున్నప్పటికీ.. అందులో టైటిల్ ఉంటుందా ఉండదా, పవన్ కల్యాణ్ స్టిల్ ఉంటుందా ఉండదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరికొన్ని గంటల్లో ఆ సస్పెన్స్ కు తెరపడనుంది.

ఇక సినిమా విషయానికొస్తే షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయింది. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.