రెండు సినిమాలతో పవన్

Sunday,January 29,2017 - 12:24 by Z_CLU

ఈ ఇయర్ రెండు సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు పవర్ స్టార్. ప్రెజెంట్ డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్న పవన్… ఈ సినిమాను ఫిబ్రవరి ఎండింగ్ వరకూ షూటింగ్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ లో థియేటర్స్ లోకి రానుంది.

ఈ సినిమా ఇలా ఫినిష్ అయ్యిందో లేదో అలా త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్తాడు పవన్. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో దర్శకుడు నేసన్ తో ఇంకో సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుండడంతో ఈ రెండింటిలో ఒక సినిమాను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయాడట పవన్. అంటే పవన్ నుంచి ‘కాటమరాయుడు’ సినిమాతో పాటు మరో సినిమా కూడా ఈ ఏడాదే థియేటర్స్ లో సందడి చేయనుందన్నమాట…