101 పై బాలయ్య ఫోకస్....

Sunday,January 29,2017 - 11:14 by Z_CLU

సంక్రాంతికి తన ప్రతిష్టాత్మక సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో ఘన విజయం అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రెజెంట్ తన 101 సినిమాపై ఫోకస్ పెట్టాడు. 100వ సినిమాకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అందరినీ అలరించిన బాలయ్య… తన నెక్స్ట్ సినిమాపై కూడా అంతే కేర్ తీసుకుంటున్నాడు. మొన్నటివరకూ కృష్ణవంశీతో ‘రైతు’ అనే సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన బాలకృష్ణ… ప్రెజెంట్ ఆ సినిమాను పక్కనపెట్టారు. ఇందుకు కారణం ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రను అమితాబ్ పోషించడమే. అమితాబ్ ఒప్పుకుంటేనే ఆ సినిమా ఉంటుందని లేటెస్ట్ గా చెప్పిన బాలయ్య తన 101 సినిమాకు మరో డైరెక్టర్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడట.

ఇక మొన్నటివరకూ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రమోషన్ లో భాగంగా విదేశాల్లో పర్యటించిన బాలయ్య ప్రెజెంట్ తన ఫోకస్ ను నెక్స్ట్ సినిమా పై పెట్టి కొంత మంది దర్శకుల దగ్గర కథలు వింటున్నారని సమాచారం. త్వరలోనే తన 101 సినిమాకు డైరెక్టర్ ను అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్న బాలయ్య ఏ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తాడో? చూడాలి..