Pawan Kalyan Movies నెక్స్ట్ ఏంటి ?

Tuesday,April 05,2022 - 04:22 by Z_CLU

Which film will be Pawan Kalyan’s next Release ?

రీఎంట్రీ తర్వాత ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే అక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు పవర్ స్టార్ నుండి రాబోయే నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అవును పవన్ చేతిలో సుమారుగా నాలుగైదు సినిమాలున్నాయి. అందులో క్రిష్ తో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఆల్రెడీ స్టార్ట్ చేసి రెండు మూడు షెడ్యుల్స్ కూడా పూర్తి చేశాడు. భారీ బడ్జెట్ తో పవన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ రేంజ్ లో తీస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

హరీష్ శంకర్ తో పవన్ చేయాల్సిన సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ క్రేజీ కాంబో సినిమా జూన్ లేదా జులై నుండి మొదటి షెడ్యుల్ జరుపుకోనుందని టాక్. పవన్ తాజాగా ఓ తమిళ్ రీమేక్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్రివిక్రమ్ ఈ సబ్జెక్ట్ ను డీల్ చేస్తున్నట్టు టాక్.  ఇదే పవన్ నెక్స్ట్ రిలీజ్ అంటూ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.

ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాకి ఇంకా టైం పడుతుంది. ఇలా పవన్ డైరీ ఫుల్ గా ఉన్నప్పటికీ ‘భీమ్లా నాయక్’ తర్వాత ఇమిడియట్ గా రాబోయే నెక్స్ట్ సినిమాపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్యాన్స్, పవన్ నుండి థియేటర్స్ లోకి రాబోయే నెక్స్ట్ సినిమాపైనే డిస్కస్ చేస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics