మెగా స్టామినాకు మరో నిదర్శనం

Sunday,January 29,2017 - 01:24 by Z_CLU

రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఖైదీ నంబర్ 150తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రికాార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. అవును.. ఖైదీ నంబర్ 150 సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు సినీచరిత్రలో ఇప్పటి వరకు కేవలం అతికొద్ది సినిమాలకు మాత్రమే సాాధ్యమైన ఈ ఘనతను… 9ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సాధించి చూపించారు. మెగాస్టార్ కు ఇంకా క్రేజ్ తగ్గలేదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాాహరణ చాలు.

khaidi-2
ఇప్పటికీ ఈ సినిమా అన్ని ఏరియాస్ లో మంచి వసూళ్లు సాాధిస్తోంది. ఏపీ, తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఇది అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. అటు ఓవర్సీస్ లో ఖైదీ నంబర్ 150 ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. విడుదలైన 5 రోజులకే మిలియన్ మార్క్ అందుకున్న ఈ సినిమా, తాజాగా 2 మిలియన్ క్లబ్ లోకి కూడా చేరింది. మరో వారం రోజుల్లో ఇది 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

khaidi-no-150-overseas-record-zee-cinemalu
వీవీ వినాయక్ డైరక్ట్ చేసిన ఖైదీ నంబర్ 150 సినిమాకు రామ్ చరణ్ నిర్మాత. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. మెగా ఎప్పీయరెన్స్ కు దేవి ట్యూన్స్ కూడా తోడవ్వడంతో… ఖైదీ సాంగ్స్ జూక్ బాాక్స్ ను షేక్ చేస్తున్నాయి.