ఓం నమో వేంకటేశాయ ఆడియో రివ్యూ

Monday,January 09,2017 - 01:00 by Z_CLU

నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్. అందులోనూ డివోషనల్ వెంచర్ అనగానే, ఓ స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్  క్రియేట్ అయ్యాయి. అక్కినేని ఫ్యాన్స్ నేచురల్ గానే అన్ని సినిమాల్లాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఎప్పుడు..? సినిమా రిలీజ్ ఎప్పుడు..? అని చిన్న సైజు ఎగ్జైట్ మెంట్ తోనే వెయిట్ చేశారు. ఆ అంచనాలకు తగ్గట్టు ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. మరకతమణి కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని కొన్ని పాటలపై.. జీ-సినిమాలు రివ్యూ…

అండపిండ గండచండ: ఈ పాటలో నాగ్ ఉగ్రరూపం ఎలా ఉండబోతుందో ఆన్ స్క్రీన్ చూడాల్సిందే కానీ, ఈ లోపు ఈ సాంగ్ క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదు. ఫాస్ట్ పేజ్ లో దూసుకుపోయే ఈ సాంగ్, యాక్షన్ బిగిన్ అనే సిగ్నల్ తో స్టార్ట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కీరవాణికి మ్యూజిక్ లవర్స్ పల్స్ తెలుసు. అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు.

కమనీయం కడు రమణీయం: వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ఉండే పాట. గతంలో ఇలాంటి పాటలెన్ని వచ్చినా, విన్నా… ఈ పాట మరోసారి సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంది.

వేయి నామాల వాడా వేంకటేశుడా: ఇక ఈ సాంగ్ ఇప్పటి నుండి ఎక్కడ డివోషనల్ ప్రోగ్రామ్స్ జరిగినా, వినిపించడం ఖాయం. ప్లెజెంట్ గా ఉండి, తేలికైన పదాలతో సాగిపోయే ఈ పాట, ఎవ్వరైనా, ఎక్కడున్నా ఈజీగా హం చేసుకునేలా ప్లాన్ చేశారు కీరవాణి.

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక :  శ్రీవారి సేవ నిమిత్తం స్పెషల్ గా ప్లాన్ చేసిన సాంగ్. టీజర్ రిలీజ్ కు ఇదే పాటను ఉపయోగించుకున్నారంటే, ఈ పాటపై అటు దర్శకుడు రాఘవేంద్రరావు, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణికి ఎంత గురి ఉందో తెలిసిపోతుంది. వాళ్ల నమ్మకానికి తగ్గట్టే ఈ పాట కంపోజిషన్ అదిరిపోయింది.

గోవింద గోవింద : ఈ సాంగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకేంద్రుడు ఏ సిచ్యువేషనల్ లో ఎగ్జాక్ట్ గా ప్లాన్ చేశాడో తెలీదు కానీ, మ్యాగ్జిమం తెలుగు లోగిళ్ళలో ప్రతి ఉదయం వినిపిస్తుంది. అంత ప్లెజెంట్ గా ట్యూన్స్ కట్టాడు కీరవాణి.

ఈ పాటలతో పాటు సాంగ్ బిట్స్, శ్లోకాలు, పద్యాలు కలుపుకొని ఓం నమో వేంకటేశాయ సినిమాలో ఓవరాల్ గా 12 కంపోజిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కంపోజిషన్ లో కీరవాణి మార్క్ సుస్పష్టం. భక్తిరస చిత్రాలకు తను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కీరవాణి ఈ సినిమాతో మరోసారి రుజువుచేసుకున్నారు. అటు నాగార్జునకు కూడా భక్తిరస చిత్రాల జాబితాలో అన్నమయ్య తర్వాత ఈ సాంగ్స్ అంతటి పేరు తీసుకురావడం ఖాయం. పాటలు ఇలా విడుదలైన వెంటనే శ్రోతల్ని ఆకట్టుకోవడం ఓం నమో వేంకటేశాయకు పెద్ద ప్లస్ పాయింట్.