

Thursday,September 22,2022 - 11:12 by Z_CLU
Nagarjuna, Praveen Sattaru The Ghost Pre-release Event In Kurnool On Sep 25th
తర్వాతి భారీ ఈవెంట్ గురించి చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది. గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు టీమ్ అంతా హాజరుకానున్నారు.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.
భరత్, సౌరబ్ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
Friday,August 18,2023 03:55 by Z_CLU
Saturday,June 17,2023 03:07 by Z_CLU
Thursday,June 08,2023 10:16 by Z_CLU
Wednesday,February 01,2023 03:24 by Z_CLU