2022 Year end బెస్ట్ హీరోస్ (పార్ట్1)
Monday,December 26,2022 - 04:20 by Z_CLU
ప్రతీ ఏడాది లానే 2022 లో కూడా తెలుగు హీరోలు డిఫరెంట్ క్యారెక్టర్స్, గ్రేట్ పెర్ఫార్మెన్స్ తో అలరించి బెస్ట్ హీరోస్ అనిపించుకున్నారు. కొందరు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మరి ఈ ఇయర్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన బెస్ట్ హీరోస్ లిస్టు చూద్దాం.

ఎన్టీఆర్ -రామ్ చరణ్
ఈ ఇయర్ బెస్ట్ హీరోస్ లిస్టులో తమ పెర్ఫార్మెన్స్ తో టాప్ ప్లే అందుకున్నారు ఎన్టీఆర్ -రాం చరణ్. రాజమౌళి తెరకెక్కించిన RRR తో ప్రేక్షకుల ముందుకొచ్చిన తారక్ , చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ డెలివరీ చేసి మెప్పించారు. అదిరిపోయే కేరెక్టర్స్ , గూస్ బంప్స్ తెప్పించే సీక్వెన్స్ లు దక్కడంతో ఇద్దరూ స్క్రీన్ పై తమ నటనతో రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్ లో అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో ఎన్టీఆర్ నటన ఒకెత్తయితే ప్రీ క్లైమాక్స్ సాంగ్ ‘కొమురం భీముడో’ సాంగ్ లో తారక్ నటన మరో ఎత్తు. ఇక చరణ్ కూడా ఇంట్రడక్షన్ సీన్ లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో మెస్మరైజ్ చేశాడు.

ప్రభాస్
ఈ ఇయర్ ‘రాదే శ్యామ్’ అంటూ ఓ పీరియాడిక్ లవ్ స్టోరీతో వచ్చిన ప్రభాస్ లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత లవ్ స్టోరీ చేసిన ప్రభాస్ మళ్ళీ వింటేజ్ ప్రభాస్ లా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేశాడు. హస్త రేఖలు చూసి భవిష్యత్తు చెప్పే పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ మెస్మరైజ్ చేశాడు. కూల్ పెర్ఫార్మెన్స్ తో డీసెంట్ లుక్స్ తో మెప్పించి ఈ ఇయర్స్ బెస్ట్ హీరో లిస్టులో చేరిపోయాడు.

పవన్ కళ్యాణ్
ఈ ఏడాది భీమ్లా నాయక్ రోల్ తో పవన్ కళ్యాణ్ అగ్రెస్సివ్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ఇగో క్లాష్ తో జరిగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ తన పవర్ చూపించి బెస్ట్ హీరో అనిపించాడు.

మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ ఈ ఇయర్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో తన రోల్ తో యాక్టర్ గా ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు. బ్యాంకులలో రుణాలు ఎగ్గెట్టే వారి భారతం పడుతూ యాక్షన్ సినిమాతో ఆకట్టుకున్నాడు మహేశ్. ముఖ్యంగా ఒకప్పటి కామెడీ టైమింగ్ తో మరోసారి అలరించాడు మహేష్. ఈ సినిమాలో మహేష్ డాన్సులు , ఫైట్స్ అన్నీ ఆకట్టుకున్నాయి.

చిరంజీవి
ఈ ఏడాది మెగా స్టార్ చిరంజీవి నుండి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆచార్య తో చిరు నిరాశ పరిస్తే గాడ్ ఫాదర్ తో మెస్మరైజ్ చేసి మెగా అభిమానులను , మూవీ లవర్స్ చేత విజిల్స్ వేయించుకున్నాడు. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో సరికొత్తగా కనిపించి మెప్పించాడు చిరు.

నాగార్జున -నాగ చైతన్య
ఈ ఇయర్ నాగార్జున -నాగ చైతన్య బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆల్రెడీ సోగ్గాడే చిన్ని నాయనలో చేసిన కేరెక్టర్ కావడంతో నాగ్ మరోసారి బంగార్రాజు గా మెప్పించాడు. ఈసారి తండ్రితో పాటు చైతు కూడా మంచి నటన కనబరిచి బెస్ట్ హీరో అనిపించాడు. ఏడాది ఆరంభంలో సంక్రాంతికి రిలీజైన ఈ సినిమాతో అక్కినేని హీరోలు బెస్ట్ హీరోల లిస్టులో చేరిపోయారు.

వెంకటేష్
ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ F3 సినిమాతో మళ్ళీ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ ఎప్పటిలానే ఫిదా అయ్యారు. వెంకీ పాత్రలో వెంకటేష్ హాస్యానికి వందకి వంద మార్కులు పడ్డాయి. ఈ కేరెక్టర్ తో ఈ ఇయర్ బెస్ట్ హీరో అనిపించుకున్నాడు వెంకీ.

రవి తేజ
ఈ ఏడాది రవితేజ నుండి మూడు సినిమాలొచ్చాయి. అందులో ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు నిరాశ పరిచాయి. కానీ ఇయర్ ఎండింగ్ లో డబుల్ యాక్షన్ తో వచ్చిన ‘ధమాకా’ డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమాలో స్వామీ వివేకానంద చక్రవర్తి గా రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ అందరినీ అలరించింది. సో ఫైనల్ గా ఈ ఏడాది ఓ బెస్ట్ కేరెక్టర్ , బ్లాక్ బస్టర్ హిట్ తో బెస్ట్ హీరోల లిస్టులో చోటందుకున్నారు మాస్ మహారాజా.

ఈ ఇయర్ డబ్బింగ్ సినిమాలతో వచ్చిన కమల్ హాసన్ , యష్ , రిశబ్ శెట్టి కూడా తమ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. టాలీవుడ్ ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా కాంతార తో రిషబ్ నటనకి తెలుగు ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics