శ్రియ కాన్ఫిడెన్స్ కి రీజన్

Monday,January 09,2017 - 11:30 by Z_CLU

శ్రియ కరియర్ ఇంకా అదే స్పీడ్ లో ఉందా..? లేకపోతే కొంచెం స్లో పేజ్ లో నడుస్తుందా..? అంటే డెఫ్ఫినేట్ గా సెకండ్ ఆప్షనే చూజ్ చేసుకోవాలి. అలాగని శ్రియ కంప్లీట్ గా రిటైర్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందా అదీ లేదు. కాస్త కాంపిటీషన్ ఎక్కువై అవకాశాలు తగ్గాయి కానీ శ్రియకి ఉన్న క్రేజ్ మాత్రం కించిత్ కూడా తగ్గలేదు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్  GPS లాంటి గ్రాండ్ వెంచర్ లో ఛాన్స్ రావడం.

GPS గౌతేమీ పుత్ర శాతకర్ణీ కి భార్యగా, ఇద్దరు పిల్లకు తల్లిగా నటించిన శ్రియ, ఈ సినిమా తరవాత మళ్ళీ తను ఫాస్ట్ పేజ్ లోకి రావడం ఖాయం అని కాన్ఫిడెంట్ గా ఉంది. సినిమాలో చేసింది తల్లి క్యారెక్టరే అయినా, తనకీ సినిమాలో రెండు అల్టిమేట్ డ్యూయట్స్ ఉన్నాయని, ఈ సాంగ్స్ చాలు, తను బ్యాక్  టు ఫాం అనిపించుకోవడానికి అని కాన్ఫిడెంట్ గా ఉందీ సిజిలింగ్ బ్యూటీ.