Nagarajuna మార్చ్ నుండి షూటింగ్ ?

Wednesday,February 01,2023 - 03:24 by Z_CLU

Nagarjuna next with Prasanna Kumar , Shoot starts from March ?

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా ప్రసన్న దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఇంకా ప్రకటన రాలేదు కానీ , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. మార్చ్ నుండి రెగ్యులర్ ఘాట్ జరుపుకొనున్న ఈ సినిమా ఫిబ్రవరిలో లాంచ్ కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం కాస్టింగ్ , లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రచయిత ప్రసన్న కుమార్ (Prasanna Kumar Bezawada) ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. ప్రసన్న ఈ సినిమాను 70, 80ల నాటి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రానుంది.

విలేజ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తాడని టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా మేకర్స్ నుండి క్లారిటీ లేదు.