Nagarjuna The Ghost - నాగ్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Sunday,August 14,2022 - 12:16 by Z_CLU

Nagarjuna’s The Ghost Movie Shooting Updates

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

ఇటివలే విడుదలైన ఘోస్ట్-కిల్లింగ్ మెషిన్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా నాగార్జున యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ బ్లాక్‌ అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక స్పెషల్ వీడియో ద్వారా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలియజేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో నాగార్జున గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించడం ఇంట్రస్టింగా వుంది.

దీనితో పాటు నాగార్జున, సోనాల్ చౌహాన్ లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్న పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వారి లుక్ అల్ట్రా-స్టైలిష్‌గా ఆకట్టుకుంది. అలాగే వారి దగ్గర వున్న మెషిన్ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్ కి రెడీ అవుతున్నట్లుగా అర్ధమౌతోంది.

THE-GHOST-nagarjuna

యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సంగీతం అందించడంలో స్పెషలిస్ట్ మార్క్ కె రాబిన్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయనది ప్రత్యేక శైలి. ‘ది ఘోస్ట్’కి ప్రత్యేకమైన స్కోర్ అవసరం కావడంతో మేకర్స్ మార్క్ కె రాబిన్ ని ఎంచుకున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ శివ కూడా 1989లో అదే తేదీన విడుదలైంది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.