ఏ మాత్రం తగ్గని ‘దంగల్’ దాడి

Monday,January 09,2017 - 02:30 by Z_CLU

డిసెంబర్ 23 న రిలీజైన అమీర్ ఖాన్ ‘దంగల్’ బాక్సాఫీస్ ని ఇంకా కలెక్షన్స్ తో షేక్ చేస్తూనే ఉంది. రికార్డ్స్ బ్రేక్ చేయడానికేనా రిలీజయింది అన్న ఫీలింగ్ ని కలిగిస్తున్న దంగల్, రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ కన్నా, రిలీజ్ తరవాత రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్ తో కాసుల వర్షం కురిపించే పనిలో పడింది.

సినిమా రిలీజైన తరవాత థర్డ్ వీకెండ్ వరసగా… ఫ్రై డే 6.66 కోట్లు, శనివారం 1.80 కోట్లు ఇక ఆదివారం 14.33 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే 350 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, బాలీవుడ్ హిస్టరీ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ చేసి, ఇప్పటికే ఆమీర్ ఖాన్  PK రికార్డు కూడా బ్రేక్ చేసేసింది.

రిలీజయిన రోజు మొదలు ఒక్క ఓవర్ సీస్ లోనే జనవరి 8 వరకు దంగల్ వసూలు చేసిన మొత్తం 180.58 కోట్లు. ఇంకా అదే స్పీడ్ తో రిలీజైన ప్రతి సెంటర్ లోను హౌజ్ ఫుల్ గా స్క్రీనింగ్ అవుతున్న దంగల్ కలెక్షన్స్ ఇంకా పెరిగే దిశలోనే ఉన్నాయని ట్రేడ్ వర్గాల ఒపీనియన్.